Tuesday, May 12, 2020

కరోనా పాట



పురుగు ప్రకోపం ప్రపంచం పాకెనాయే
రోగం రూపం ఎవ్వరూ ఎరుగరాయే
ప్రాణం కోసం పరుగు నిలకడాయే
కలకలం గడతేర్చు తీరం కానరాకపాయే
*
గ్రహమో గాని నీవు భువి పైకొస్తివి గద
PPE కిట్ లు లేకున్న గాని
ప్రజల గొరకు నీ ప్రాణం పణ మెడితివి గద
డాక్టరన్నోనీవు దశావతారమన్న
భధ్రమన్నో... నీ కుశలం ముఖ్యమన్న
*
కంటికి కునుకైన లేకపాయె గద
మా బతుకులకు నీ గుండె అడ్డేస్తివి
వెయ్యేళ్ల ఊడిగమైనా తక్కువ గద
డాక్టరన్నోనీ ఋణమెట్ల తీరునన్న
భధ్రమన్నోనీ కుశలం ముఖ్యమన్న
*
ఎండనక వాననక కాపల గాస్తివి గద
ఆపద ఎదురోస్తూన్న గాని
ముందు వరస సైనికుడైతివి గద
పోలీసన్నోనీవు పరమాత్ముడవన్న
భధ్రమన్నోనీ కుశలం ముఖ్యమన్న
*
దాటొద్దని లక్ష్మణ రేఖ గీస్తివి గద
దాటినోడు ఎవడైన గాని
ముందు వెనుక మోగిస్తివి గద
పోలీసన్నోనీ పంతం గొప్పదన్న
భధ్రమన్నో…. నీ కుశలం ముఖ్యమన్న

_కలం - తేజారత్నం


No comments:

Post a Comment