Wednesday, May 13, 2020

TOR Project - Browser అంటే ఏంటి?



అప్పట్లో ఓ సినిమా వచ్చింది 'ఈనాడు' అని. క్లైమాక్స్ లో, ఓ హ్యాకర్ తో కమల్ హాసన్ కాల్స్ ని  ట్రేస్ చేసి తనని లొకేట్ చేయాలనుకుంటారు. కానిమల్టిపుల్ లొకేషన్స్ నుండి అదే నంబర్ తో కాల్ వస్తున్నట్లు తెలుసుకొని షాక్ అవుతారు. బ్రిలియంట్ కదా..?!

అదే బ్రిలియన్స్ మన చేతుల్లో ఉందిపుడు. తరచూ వింటూ ఉంటాం. బ్యాంక్స్, ఈ మెయిల్స్, సోషల్ మీడియా ఎకౌంట్స్.. కి సంబందించిన Confidential Data theft  ఐనట్లు. అంటే, మన ఉపయోగిస్తున్న web ఎంత un-secured-o అర్ధంచేస్కోవాలి.  కాని TOR అనే సంస్థ ఈ విషయం ఎపుడో అర్ధం చేస్కుంది. Worldwide గా ఓ Volunteer Overlay Network ని ప్రోగ్రాం చేసి, ఆ సాఫ్ట్-వేర్ ని Open source చేసి పడేసింది. దీని పేరే TOR Project.

User web activity ని ఎంత సీక్రెట్ గా మైంటైన్ చేస్తుందంటే.. ఒక సారి TOR Virtual Servers లోకి ఎంటర్ ఐన User data క్షణానికో సర్వర్ మారుతుంది! అందుకే IP.. IP లా తిన్నగా ఉండదు. సర్వర్ టు సర్వర్ Transmission అయ్యే కొద్ది Data encrypt అయి decrypt అవుతూ ఎన్నో layers లో Complex Code ని డెవెలప్ చేస్తుంది. అందులో ఉంటుంది యూసర్ డేటా! ఇందు మూలంగా చెప్పెదేమనగా, హ్యాకర్ మన డేటా ని తెఫ్ట్ చేయాలనుకుంటే అతను అనుకున్నంత సులవైతే కాకపోవచ్చు.  యూసర్ ప్రైవసీ ఎక్కువుండడం వల్ల అప్రయోజనాలు లేకపోలేదు. 

_కలం - కృష్ణ సంతోష్ 


No comments:

Post a Comment