Wednesday, May 13, 2020

A Moment to Remember (2001) John H.Lee's film | పరిచయం

అన్ని ప్రేమ కధలు మనసుని హత్తుకోలేవు. కొన్ని రోజుల్లో మర్చిపొతే.. కొన్ని వారాల్లో మర్చిపోతాం.. అరుదైన కొన్ని ప్రేమ కదలుంటాయి, జీవితాంతం గుర్తుండి పోతాయి, చచ్చే దాకా! ఆ కోవలోకి వచ్చేదే ఈ సినిమా.

అతని పేరు చల్-సు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రి లో ఓ ఎక్పిరియన్స్డ ఫోర్మెన్. ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక. అందుకోసం ప్రిపేర్ అవుతున్న వ్యక్తి. ఒకరోజు ఓ గ్రాసరీ స్టోర్ లో ఆమె అనుకోకుండా ఎదురవుతుంది. ఆమె పేరు సు-జిన్. ఫాషన్ డిసైనర్. కంపెనీ లో తన కొలీగ్ ని ప్రేమిస్తుంది. మోసం చేస్తాడు. ఆ సంఘటన తర్వాత, గ్రాసరీ స్టోర్ లో అనుకోకుండా చల్-సూ కి ఎదురైంది. ఓ చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల వీరిద్దరూ ఆ మోమెంట్, కలుస్తారు. 

సుజిన్ ఫాదర్ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ CEO. మోసపోయి, బాధలో ఇంటికి తిరిగి వచ్చిన సుజిన్ ని ప్రేమతో క్షమిస్తాడు. ఇక తన లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది సు-జిన్. 


ఒక రోజు తన ఫాదర్ తో కలిసి కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తుంది. అక్కడ ఫోర్మెన్ గా వర్క్ చేస్తూ.. ఎదో సేఫ్టి ఇస్శ్యు మీద ఇంజినీర్ తో గొడవపడుతున్న చల్-సూ కనిపిస్తాడు. స్టోర్ దగ్గర తను అపార్ధం చేస్కున్న వ్యక్తి కదా భయపడుతుంది. కొన్ని రోజులకి తన భయం ఇష్టం లా మారి చివరికి ప్రేమవుతుంది. కొంత కాలానికి వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగి పెళ్ళికి దారితీస్తుంది. 


సు జిన్ ఫాదర్ తన కూతురు ప్రేమించింది చల్ సు తోనేనని తెలుసుకొని. అర్ధం చేస్కొని వారి పెళ్ళికి ఒప్పుకుంటాడు. వీరిద్దరికీ పెళ్ళవుతుంది. రోజులు గడుస్తాయి. చల్ సు ఆర్కిటెక్ట్ అవుతాడు. సూ జిన్ ఫాదర్ ఓ క్లైంట్ కి చల్ సు ని రిఫర్ చేస్తాడు. అతని ప్రసేంటేషన్ నచ్చి క్లైంట్ చల్ సు కి ప్రాజెక్ట్ ఇస్తాడు. చల్ సు - సుజిన్ సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. నెలలు గడుస్తాయి. 


సు జిన్ తరచుగా కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ ప్రాబ్లం తన ఇంటి దారినే మర్చిపోఏటంత పెద్దదవుతుంది. కాని ఈ విషయం చల్ సు కి చెప్పి బాధ పెట్టాలనుకోదు. ఒక సందర్భంలో చల్ సూ ఆ డాకార్ ని మీట్ అయి తను 'ఆల్సైమర్స్' అనే డిసీస్ తో బాధపడుతోందని తెలుసుకుంటాడు. కాలం గడిచే కొద్ది సు జిన్ మైండ్ నుండి తన మెమోరీస్ అన్ని ఎరేస్ అయిపోతాయి. తన కుటుంబాన్ని. చల్-సు ని కూడా మర్చిపోతుంది! చివరికి తనేమవుతుంది? చల్ సు ని తన ప్రేమని గుర్తు తెచ్చుకుంటుందా? తిరిగి తను నార్మల్ అవుతుందా? లేదా తెలుసుకోవాలనే మాత్రం ఈ ఎమోషనల్ జర్ని చేయాల్సింది. 


ఇంత సెన్సిబుల్ ఫిలిం ఐనందుకే 2004 సౌత్ కొరియా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టింది. ఆ యియర్ టాప్ 5 హైయ్యెస్ట్ గ్రోసింగ్ ఫిలిమ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ ఫిలిం కాస్ట్ అండ్ క్రూ, ముఖ్యంగా డైరెక్టర్ జాన్. లీ పై ప్రశంసలు వర్షం కురిపించింది.


No comments:

Post a Comment