Sunday, May 24, 2020

Mobile Cameras vs Mega pixels


ఆర్టికల్ లో మనం megapixels గురించి మాట్లాడుకుందాం.ఇది మొబైల్ ఫోన్ DSLR Mirror less కెమెరా కి కూడా వర్తిస్తుంది. కానీ మొబైల్ ఫోటోగ్రఫి ప్రస్తుత కాలంలో ట్రెండింగ్ కాబట్టి  మనం ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ - మెగా పిక్సల్స్ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం.

మనం మామూలుగా చూస్తూ ఉంటాం ప్రకటనలలో megapixels యొక్క సంఖ్య పెరిగితే కెమెరాల్లో స్పష్టత, ఫోటో లో నాణ్యత పెరుగుతుందని. నమ్ముతాం కూడా. కానీ ఇది ఎంతవరకు సత్యం?

·         మొదటగా.. Megapixel అంటే ఏంటి?

Resolution అని వినే ఉంటారు. మీరు తీసుకున్న ఫోటో resolution 4000×3000 అయితే మీ megapixel సంఖ్య 12. అదే ఒక వేళ అది 8000×6000 అయితే అపూడు 48Mp. పాటికే అర్థం అయుండాలి. Megapixel పెరుగుతోంది అంటే… resolution పెరుగుతోంది అని.

·         కానీ మనకి higher resolution ఆవశ్యకత ఏంటి?

ఎందుకు అంటేమనం తీసుకున్న ఫోటో crop చేసినా లేక పెద్ద సైజ్ లో print చేసినా కూడా ఫోటో నాణ్యత తగ్గకుండా ఉండాలని. అంటే… higher resolution ఉంటే photo నాణ్యత పెరిగినట్లు కాదా అంటే కాదు. ఇక్కడే అన్ని ఫోన్ కంపెనీలు మనల్ని పప్పు లో కాలు వేసేలా చేస్తాయి.

ఫోటో యొక్క నాణ్యతకి కారణం ఒక్క megapixel మాత్రమే కాదు. ఇంకా చాలా వాటిని పరిగణన లోకి తీసుకోవాలి. అవి ఏంటి అంటే:-
·         Colors
·         Dynamic range (Shadows and highlights)
·         Low light ప్రదర్శన ఎలా ఉంది?

మన స్మార్ట్ ఫోన్ కెమెరా లో రెండు భాగాలు:
1.         Hardware
2.         Software

1. hardware లో sensor ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన smart phone లో ఉండే sensor DSLR full frame, crop frame లతో పోలిస్తే చాలా చిన్నది. Sensor చిన్నది అయినప్పుడు megapixels ని ఎంత పెంచినా సరే.. ప్రయోజనం ఉండదు!

ఎందుకు అంటేఅంత చిన్న sensor మీద ఎక్కువ (108) megapixels భారం మోపితే అది ఎలా భరించలదు? (low light condition లో అయితే.. high Megapixels ఉన్న కెమెరా ఫోన్ ఐనప్పటికినీ image quality output కోసం ISO పెంచితే photo లో noise రావడం జరుగుతుంది. అది quality output అనిపించుకోదు)

2. phone లో image processing software ఒకటి ఉంటుంది software మనం తీసే raw photos ని తనకు తానుగా Develop చేసి మనకి jpeg format లో అందజేస్తుంది. అందుకే మధ్య కొన్ని cameras లో వచ్చే ఫోటోస్ కి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఉదాహరణకి apple, samsung, google pixel లాంటి company ఫోన్ల cameras లో megapixel తక్కువ అయినప్పటికీ ఫోటోలు అందులోనే బాగుంటాయి. ఎందుకంటే వాటిలోని image processing software మరియూ colors dynamic range low light performance అద్భుతం గా ఉంటాయి కాబట్టి.

తక్కువ megapixels అయినంత మాత్రాన మన దగ్గర ఉన్న కెమెరా మంచిది కాదు అని కాదు. నిజానికి చెప్పాలి అంటే.. ఎక్కువ megapixel ఉన్న camera లో వచ్చే ఫోటోల కన్నా ఒక్కొసారి తక్కువ megapixel ఉన్న కెమెరా లో వచ్చే ఫోటో లే బాగుండవచ్చు. ముఖ్యంగా low light లో. Apple ఫోన్ లు దానికి ఉదాహరణ.

కాబట్టి ఇకమీదట మీరు ఫోన్ లు కొనే ముందు క్ కెమెరా గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటేఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది.

1.    Colors
2.    Dynamic range & Low light performance
3.    (ఆఖరున) Megapixels

మన ఫోన్ కంపెనీలు మనల్ని ఆకర్షించడానికి megapixels ని మాత్రమే హై లైట్ చేసి చూపుతూ ఉంటాయి.  కాని మనం మోసపోకూడదు.

No comments:

Post a Comment