Wednesday, May 13, 2020

Strangers on a train (1951) - Alfred Hitchcock's film | పరిచయం

హీరో ఓ టెన్నిస్ ప్లేయర్. పేరు గాయ్ హేన్స్. అతనూ, వాషింగ్టన్ సెనేటర్ కూతురైన 'ఆనీతో' ప్రేమలో ఉంటడు. పెళ్లి అయినా మరొకరితో ఎఫైర్ పెట్టుకొని ప్రేగ్నంట్ అయిన వైఫ్ ఉంటుంది. పేరు మీరియం. డివోర్స్ కి తన ఒప్పుకోనని, పుట్టబోయే బేబీకి తండ్రివి నువ్వేనని చెప్పి, హేన్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒకరోజు హేన్స్ ట్రైన్ జర్నిలో ఓ స్ట్రేంజర్ ని కలుస్తాడు. అతని పేరు బ్రూనో ఆంటోనీ. 


మాటల్లో.. అతను ఇంటరెస్టింగ్ గా ఓ కధ చెప్పినట్లు, ఓ మర్డర్ స్కీం ని ఎక్సిక్యూట్ చేయడానికి ఓ ఐడియా చెప్తాడు. అతని మాటలకి ఫుల్స్టాప్ పెట్టలేకపోతాడు హేన్స్. బ్రూనో చెప్పే ఐడియా ఎంటటే, ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు చేయాలనుకుంటున్న మర్డర్స్ ని స్వాప్ చేస్కోవడం! అంటే.. "నీకు ఇష్టం లేని మీరియం ని నేను చంపుతాను. నేను ద్వేషించే తండ్రిని నువ్వు చంపు" అని. సో.. ఒక కంప్లీట్ స్ట్రేంజర్, మర్డర్ చేయడంలో ఎలాంటి మోటివ్ అనేది ఉండదు కాబట్టి.. ఎవ్వరికి డవుట్ రాదనీ.. తమని ఎవ్వరూ సస్పెక్ట్ చేయలేరని చెప్తాడు. అతనో సైకోపాత్ అని హేన్స్ కి తెలియదు! 


కొంత సేపటికి, లాయర్ ని మీట్ అవ్వడానికి హేన్స్ మీరియం ని తన ఆఫీస్ లో కలుస్తాడు. ఆమె ఒప్పుకోనని. తన కడుపులో ఉన్న బేబీకి తండ్రివి నువ్వు కాదు అన్నది నిజమే ఐన.. నువ్వు ప్రూవ్ చేయలేవని చెప్పి గొడవ పడుతుంది. వెంటనే 'ఆనీ' కి కాల్ చేసి జరిగింది చెప్తాడు, కోపంలో 'తను మీరియం ని చంపెయ్యాలనుంది' అని ఆవేశంలో అంటాడు. 


కొంత సేపటికి, జర్నీ లో కలిసిన బ్రూనో కి కాల్ చేసి ఎం మాట్లాడకుండా పెట్టేస్తాడు. హేన్స్ తన మర్డర్ ప్లాన్ ని ఒప్పుకున్నాడని బ్రూనో తప్పుగా ఊహిస్తాడు. 


ఒకరోజు, తన బాయ్ ఫ్రెండ్స్ తో ఓ అముస్మేంట్ పార్క్ కి వచ్చిన మీరియం ని ఫాలో అయ్యి చంపేస్తాడు బ్రూనో.. అదే హేన్స్ దగ్గరికి వెళ్లి, ఎవ్వరికి ఎలాంటి డవుట్ రాలేదనీ.. తననెవరూ చూడలేదని.. చెప్తూ హేన్స్ ట్రైన్ లో మర్చిపోయిన తన సిగరెట్ లైటర్ని, మీరియం ని చంపే ప్రాశస్ లో కింద పడినా.. తాను కేర్ఫుల్ దాన్ని తిరిగి తీస్కున్నాననీ చెప్తాడు! సో, తన తండ్రిని చంపడానికి ప్లాన్ కూడా తన దగ్గరే ఉందనీ.. అప్పటికే భయపడుతున్న హేన్స్(!) తో అంటాడు. ఎం చేయాలో తెలియక అక్కడ నుండి నిష్క్రమిస్తాడు హేన్స్! 


ఇప్పుడు చెప్పండి. హేన్స్ బ్రూనో ఫాదర్ ని చంపకపోతే.. బ్రూనో హేన్స్ ని వదిలిపెట్టడు. హేన్సే ఈ మర్డర్ చేసాడు అని ప్రూవ్ చేయడానికి, బ్రూనో దగ్గరున్న ఆ ఒక్క లైటర్ చాలు.. సో చివరికి ఏమవుతుందనే థ్రిల్ ని ఫిల్మ్ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయాలి. 


ఇంత పెక్యులియర్ స్టోరి ని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇంకెంత గ్రిప్పింగ్ గా తీస్తాడు. అతనికి వర్డ్ సినిమాలో 'ది ఫాదర్ ఆఫ్ సస్పెన్స్' అని పేరు! సస్పెన్స్ ఫిలిమ్స్ ని ఇష్టపడే వారు ఈ ఫిలిం ని అస్సలు మిస్ అవ్వద్దు. 

No comments:

Post a Comment