Wednesday, May 13, 2020

Spellbound (1945) - Alfred Hitchcock's film | పరిచయం



సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి ,ఈ ఫిలిం, ఓ హై బెంచ్ మార్క్ నే క్రియేట్ చేస్తుంది.

హిరోయిన్ పేరు కాన్స్టన్స్ పీటర్సన్. వెర్మంట్ లోని తెరాప్యుటిక్ కమ్యూనిటి మెంటల్ హాస్పిటల్  లో ఓ యంగ్ సైకోఅనలిస్ట్. డిటాచ్డ అండ్ ఎమోషన్-లెస్ అని అక్కడ ఉన్న డాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. ఆ హాస్పిటల్ డైరెక్టర్ పేరు డా|| మర్చిసన్. నెర్వస్ ఎక్సాషణ్ వల్ల తను త్వరగా రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. అతని రిప్లేస్మేంట్, డా|| అంటోనీ ఎడ్వర్డ్స్. రెస్పాన్సిబిలిటి తీస్కోడానికి అక్కడికి వస్తాడు.

సైకో అనాలసిస్ మీద యంగ్ ఏజ్ లోని ఎంతో రిసర్చ్ చేసి పేరు తెచ్చుకున్న డాక్టర్ అతను. ఒక సందర్భంలో అతనికున్న ఫోబియా ని కాన్స్టన్స్ గుర్తిస్తుంది. ఆ ఎపిసోడ్స్ తరచుగా జరిగే ప్రాసస్ లో అతను నిజమైన డా|| ఎడ్వర్డ్స్ కాదని అందరికన్నా ముందుగా తెలుసుకుంటుంది. కాని అతను 'ఇనోసెంట్' అని నమ్మి ట్రీట్ చేసే ప్రాశస్ లో, తనకి 'అమ్నీషియ' ఉండడం వల్ల జరిగిందేమీ గుర్తులేదని, 'గిల్ట్ కాంప్లెక్స్' వల్ల ఎడ్వర్డ్స్ ని తానె చంపినట్లు  నమ్ముతున్నాడని అర్ధం చేస్కుంటుంది.

తనవల్ల కాన్స్టన్స్ కి ప్రాబ్లం రాకూడదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడతను. ఈ లోపు, ఎడ్వర్డ్స్ ని చంపి అతని ప్లేస్ లో వచ్చింది జాన్ బ్రౌవ్న్ అనే మరొక వ్యక్తి, ఇతనే అని అందరికి తెలుస్తుంది! సర్వేలన్స్ మొదలవుతుంది. కాన్స్టన్స్ బ్రౌన్ ని ఎక్కడున్నాడో ట్రాక్ చేసి కనుక్కుంటుంది. అతని అమ్నీషియ బ్రేక్ చేసే ప్రాసర్ లో, పోలిస్ సర్వేలన్స్ ఎక్కువుండడం వల్ల, న్యూయార్క్ లోని తన మెంటార్ అయిన డా|| అలెక్సాండర్ బ్రూలో దగ్గరికి వెళ్తారు.

          అక్కడ బ్రౌన్ కన్న ఓ డ్రీం ని కాన్స్టన్స్ అండ్ బ్రూలో అనలైస్ చేస్తారు. ఆ డ్రీం లో "కళ్ళు, కర్టన్స్, సిసర్స్, ప్లేయింగ్ కార్డ్స్, ముఖం లేని ఓ వ్యక్తి, బిల్డింగ్ నుండి పడిపోతున్న మరొక వ్యక్తి, ఓ చిమ్ని వెనుక దాక్కొని చేతిలోని వీల్ ని డ్రాప్ చేస్తున్న వేరొక వ్యక్తి, తననే చేస్ చేస్తున్న ఓ పెద్ద రెక్కల నీడ. లాంటివి కొన్ని సైన్స్ ఆ డ్రీం లో ఉంటాయి. ఈ డ్రీం ని ఆదారంగా చేస్కొని, కాన్స్టన్స్ తన అనలెటికల్ పవర్ తో బ్రౌన్-కి ఉన్న ఫోబియాని, గిల్ట్ కాంప్లెక్స్ ని బ్రేక్ చేయడం. నిర్దోషిగా నిలబెట్టడం. చిట్ట చివరికి డా|| ఎడ్వర్డ్స్ ని చంపిన వ్యక్తిని, ఆ డ్రీం ని ఆదారంగానే కన్ఫ్రంట్ చేసి స్పాట్ చేయడం చూస్తె రియల్ సైకలాజికల్ థ్రిల్లర్ లో డీప్ డైవ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.    

          కాన్స్టన్స్ పాత్ర చేసిన ఇంగ్రిడ్ బెర్గ్మెన్. బ్రౌన్ పాత్రను చేసిన గ్రేగొరి పెక్. ఫిలిం డైరెక్ట్ చేసిన అల్ఫ్రెడ్ హిచ్కాక్ స్కిల్ ఎక్సలన్స్ ని, చెప్పాలంటే కంప్లీట్ గా ఓ మాస్టర్ పీస్ ని ఎక్స్పిరియన్స్ అవ్వాలంటే మాత్రం మిస్ అవద్దు. YTS లో ఓ సింగల్ క్లిక్ దూరంలో ఉంది మరి.  
           

No comments:

Post a Comment